Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీ సిమెంట్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Advertiesment
supreme court
, బుధవారం, 2 ఆగస్టు 2023 (11:32 IST)
వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగగా, భారతీ సిమెంట్స్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను గతంలో ఈడీ స్వాధీనం చేసుకోగా, వీటిని తిరిగి ఇచ్చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఈడీకి ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేయగా, మంగళవారం వాదనలు జరిగాయి. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలను వినిపించారు. ఈ కేసుకు సంబంధించి బ్యాంకు గ్యారంటీలు లేదా ఎఫ్‌డీలలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోర్టు చెప్పిందని... దీంతో, ఎఫ్‌డీ‌లనే ఈడీ ఎంచుకుందని ధర్మాసనానికి ఎస్వీ రాజు తెలిపారు. 
 
బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా కల్పించుకుంటూ... మీరు ఎఫ్‌డీలను నగదుగా మార్చుకున్నారని ప్రతివాదులు చెపుతున్నారని ప్రశ్నించారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని... దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు. ఎఫ్‌డీ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలన్న టీఎస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు. బ్యాంకు గ్యారంటీలను వెనక్కి తీసుకునే విషయాన్ని ప్రతివాదులకే వదిలేస్తున్నామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మోటో.. రూ. 10వేల బడ్జెట్‌తో కొత్త G సిరీస్ స్మార్ట్ ఫోన్