Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యాయ దేవతకు క్షీరాభిషేకం.. నిలిచిన నిర్మాణాలు

amaravati lands
, గురువారం, 3 ఆగస్టు 2023 (20:51 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఆర్-5 జోన్‌ను కొత్తగా సృష్టించి అక్కడ పేదలకు గృహాలను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం మొండిపట్టుదలతో ముందుకుపోగా దానికి రాష్ట్ర హైకోర్టు గట్టి షాకిచ్చింది. ఆర్-5 జోనులో ఏపీ సర్కారు చేపట్టిన గృహాల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి హర్షం వ్యక్తం చేసింది. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులతో చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఆర్‌-5 జోన్‌ చట్ట వ్యతిరేకమని తాము మొదటి నుంచీ చెబుతున్నామని ఐకాస నేతలు గుర్తుచేశారు. పేదల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దని.. వారి ప్రాంతాల్లోనే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు.
 
ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించడంపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తుళ్లూరు, కృష్ణాయపాలెంలోని దీక్షా శిబిరాల్లో న్యాయదేవతకు క్షీరాభిషేకం చేశారు. పేదలను మోసం చేసేందుకే ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌లో స్థలాలు ఇచ్చిందని రైతులు ఆరోపించారు. 
 
మరోవైపు హైకోర్టు తీర్పుతో కృష్ణాయపాలెంలోని ఆర్‌-5 జోన్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అక్కడ నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులను పోలీసులు బయటకు పంపించారు. రాజధాని రైతులు ఇళ్ల స్థలాల్లోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటువైపు ఎవర్నీ రానీయకుండా ఆంక్షలు విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10 నుంచి వారాహి యాత్ర.. విశాఖలో రచ్చ చేయనున్న పవన్