Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాతినొప్పి పేరుతో పోసాని డ్రామాలు... ఖాకీలకు వైకాపా నేత ముప్పతిప్పలు (Video)

ఠాగూర్
ఆదివారం, 2 మార్చి 2025 (15:40 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్టయిన సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అనారోగ్యం పేరుతో డ్రామాలు ఆడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని.. అనారోగ్యంగా ఉందంటూ పోలీసులను కంగారు పెట్టించారు. దీంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. మరిన్ని మెరుగైన వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లోనూ వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చారు. 
 
అయితే, పోసాని ఈ డ్రామాలు ఆడటానికి కారణాలు లేకపోలేదు. శనివారం ఉదయం ములాఖత్‌లో పోసానిని రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే పోసానికి ఛాతినొప్పి ప్రహసనం మొదలైంది. దీంతో ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేయించగా, అది కేవలం నాటకమని తేలిపోయింది. 
 
ఇదే అంశంపై రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చాతి నొప్పి పేరుతో పోసాని డ్రామాలు ఆడారని తెలిపారు. పోసాని అడిగిన అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించాం. ఎలాంటి అనారోగ్యమూ లేదని తేలింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. ఆయనను తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నాం అని వెల్లడించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments