Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో పేకాట ఆడుతూ చిక్కిన సీఐ - ఎస్ఐ అరెస్టు

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (08:37 IST)
కొందరు పేకాట రాయుళ్లతో కలిసి పేకాట ఆడుతున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్ఐ‌ పోలీసులకు చిక్కారు. తిరుపతి జిల్లాలోని తిరుపతి గ్రామీణ మండలం రాఘవేంద్ర నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దాన్ని పేకాట స్థావరంగా మార్చివేశారు. ఈ విషయం బయటకు పొక్కి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేయగా, మొత్తం 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 
 
అరెస్టు చేసిన వారిలో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఒక ఏఎస్ఐతో పాటు మొత్తం 11 మంది ఉన్నారు. వీరి నుంచి భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో అధికార వైకాపాకు చెందిన నేతలు ఉన్నారు. ఈ కారణంగానే వారి అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ విషయం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దృష్టికి వెళ్లింది. 
 
దీంతో అదే రోజురాత్రి పట్టణంలోని తూర్పు స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న జోగారావు, కార్పొరేటర్  ఆంజనేయులు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో నాగరాజు, డి.సురేశ్, డి.కిరణ్ కుమార్, పి.కృష్ణారెడ్డి, బి.చెంచుముని, ఎన్.శ్రీనివాసులు, కె.మునిప్రసాద్, కె.రాధాకృష్ణ, కార్పొరేట్ కె.ఆంజనేయులు, ఎస్. నరేంద్ర, ఏఎస్ఐ జోగారావు, సీఎం చంద్రశేఖర్‌లు ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడితో కేసు నుంచి తప్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments