బీహార్ రాష్ట్ర మంత్రి తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో ఘోర పరాభవనం జరిగింది. ఆయన లగేజీని హోటల్ సిబ్బంది బయపడేశారు. ఆయన లేని సమయంలో ఆయన బుక్ చేసుకున్న గది తలుపులు తెరిచి ఆయన లగేజీని తీసుకొచ్చి రిసెప్షన్ వద్ద పడేశారు. తిరిగి హోటల్‌కు వచ్చిన ఆయనకు తన లగేజీ బయటవుండటం చూసి ఒకింత షాక్‌కు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే,
ఓ పనిమీద యూపీలోని వారణాసికి వెళ్లిన తేజ్‌ప్రసాద్... వారణాసిలోని ఓ హోటలులో బస చేశారు. ఆ తర్వాత ఆయన తన వ్యక్తిగత పనిమీద హోటల్ బయటకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రి లగేజితోపాటు సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులను బయటపడేశారు. శుక్రవారం రాత్రి హోటల్‌కు తిరిగివచ్చిన మంత్రి తమ లగేజి రిసెప్షను వద్ద ఉంచడం చూసి ఖంగుతిన్నారు. మంత్రికి కేటాయించిన గదిని ఆయన గైర్హాజరీలో తెరిచి, వస్తువులను బయట పడేశారని తేజ్‌ప్రతాప్ యాదవ్ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏసీపీ సంతోష్‌సింగ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. బీహార్ మంత్రి పేరిట ఏప్రిల్ 6వ తేదీ (గురువారం) ఒక్కరోజు మాత్రమే గదిని బుక్ చేసినట్లు హోటల్ యాజమాన్యం చెప్పిందన్నారు. శుక్రవారం ఆ గదిని మరొకరికి కేటాయించడంతో బయటకు వెళ్లిన మంత్రి కోసం ఎదురుచూసి, చివరకు ఖాళీ చేసి లగేజిని రిసెప్షన్ వద్దకు చేర్చినట్లు తెలిపారని చెప్పారు. దీనిపై మంత్రి అనుచరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.