మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే!!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (12:05 IST)
గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు షాకులపై షాకులు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న విశాఖ కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం వద్ద ఆయన ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎన్డీయే కూటమితో కలిసి పని చేస్తానని తెలిపారు. అయితే ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని మాత్రం తాను ఇపుడే వెల్లడించనేనని తెలిపారు. 
 
దొరబాబు పిఠాపురం సెగ్మెంట్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా 2019లో వైకాపా ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2014లో వైకాపా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే, 2024లో పిఠాపురం నుంచి వైకాపా తరపున వంగా గీతను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టగా, జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. 
 
గత ఎన్నికల్లో తనను కాదని వంగా గీతకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం, ఆమె పార్టీ కార్యాలయాన్ని తమ సమీపంలోనే ఏర్పాటు చేయడంతో దొరబాబు మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికలకు ముదే పార్టీని వాడాలని ఆయన భావించారు. కానీ, జగన్ ఆయన్ను బుజ్జగించారు. దీంతో ఎన్నికల్లో దొరబాబు పెద్దగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు. అయితే, ముగిసిన ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఒక్కొక్కరు వైకాపాను వీడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments