Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్‌‍లో హింస - 100 మంది మృతి.. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా!!

sheik hasina

వరుణ్

, సోమవారం, 5 ఆగస్టు 2024 (17:18 IST)
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ఇందులో దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన ఘర్షణల్లో వీరంతా చనిపోయారు. కాగా, ఆ దేశంలో ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటననల్లో సుమారుగా 300 మంది చనిపోయారు. దీంతో ఆ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్‌ను వీడిన ప్రధానమంత్రి షేక్‌ హసీనా.. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో పీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించింది.
 
దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని హసీనా, ఆమె సోదరి రెహానాలు రాజధాని ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే, వాళ్లు ఎక్కడికి వెళ్లారనే విషయంపై స్పష్టత లేదు. భారత్‌ వెళ్లి ఉండొచ్చని పలు మీడియా సంస్థలు చెబుతుండగా.. మరికొన్ని మాత్రం వేరే దేశం వెళ్లనున్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు.. అక్కడ విధ్వంసం సృష్టించారు.
 
ఇదిలావుంటే, హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. నిరసనకారులు హింసామార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చిన కమలా హారిస్!!