Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ భావేద్వేగానికి లోనైన రిషి సునాక్!

rishi sunak

వరుణ్

, శుక్రవారం, 5 జులై 2024 (18:11 IST)
బ్రిటన్‌ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఫలితాల తర్వాత రిషి సునాక్ తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీ ముందు నిలబడి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో ఓటమికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. 
 
'ముందుగా మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా. ప్రధానిగా నా బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించానని భావిస్తున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం ఖచ్చితంగా మారాల్సిందేనని మీరు (ప్రజలు) స్పష్టమైన సందేశమిచ్చారు. మీ తీర్పే అంతిమం. మీ ఆగ్రహాన్ని, అసంతృప్తిని నేను విన్నాను. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదేట అంటూ తన భార్య అక్షతామూర్తిని చూసుకుంటూ సునాక్‌ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
 
అటు కన్జర్వేటివ్‌ పార్టీ నేతలకు కూడా సునాక్‌ క్షమాపణలు చెప్పారు. 'మా పార్టీలో చాలా మంది నా సహ ఎంపీలు ఈసారి సభ్యత్వం కోల్పోయారు. ఇది నన్ను చాలా బాధించింది. ఇందుకు బాధ్యత వహిస్తూ పార్టీ అధినాయకత్వ పదవికీ రాజీనామా చేస్తా. అయితే వెంటనే కాదు.. కొత్త నేతను ఎన్నుకునే అధికారిక ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ బాధ్యతల నుంచి వైదులుగుతా' అని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు రిషి సునాక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి వ్యక్తి అని ప్రశంసించారు.
 
'ఎన్నో గడ్డు పరిస్థితుల తర్వాత ఇది చాలా కష్టమైన రోజు. ఈ దేశ ప్రధానిగా సేవ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం మనది. బ్రిటిష్‌ ప్రజలందరికీ ధన్యవాదాలు' అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం తన భార్యతో కలిసి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌కు వెళ్లారు. ప్రధానిగా తన రాజీనామా పత్రాన్ని బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి అందించారు. సునాక్‌ రాజీనామాను రాజు ఆమోదించారు. ఇక కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కింగ్ చార్లెస్ దృష్టిసారించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ