Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటమి దిశగా రిషి సునాక్‌... బ్రిటన్ కొత్త ప్రధానిగా కైర్ స్టార్మర్!?

Advertiesment
rishi sunak

వరుణ్

, శుక్రవారం, 5 జులై 2024 (09:53 IST)
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రుషి సునాక్ ఓడిపోబోతున్నారు. ఆ దేశ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు అంచనాలను పరిశీలిస్తే, ఆయన మాజీ కావడం తథ్యంగా కనిపిస్తుంది. అదేసమయంలో బ్రిటన్ దేశ కొత్త ప్రధానిగా కైర్ స్టార్మర్ ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నయి. 
 
భారత కాలమానం ప్రకారం.. లేబర్ పార్టీ అభ్యర్థులు 267 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. రిషి సునాక్ ప్రాతినిథ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ కేవలం 47 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. ఆధిక్యం సాధిస్తున్న లేబర్ పార్టీ అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ ఆధిక్యాన్ని చూస్తుంటే యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లెబర్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించడం ఖాయంగా కనిస్తోంది.
 
కాగా లండన్‌లోని లెబర్ పార్టీ చీఫ్, కాబోయే ప్రధాని స్టార్మర్ ఘన విజయాన్ని సాధించారు. ఆరంభ ఫలితాల్లో హోల్ బోర్న్ అండ్ సెయింట్ పాన్ఫ్రా క్రాస్ స్థానం నుంచి ఆయన 18,884 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాను గెలుపొందిన నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.
 
కాగా యూకే ఎన్నికల్లో లెబర్ పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేసిన విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్లో మొత్తం 650 సీట్లు ఉన్నాయి. లేబర్ పార్టీ 410 స్థానాలను గెలుచుకోబోతోందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతోందని అంచనా వేశాయి. ఇక ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమిపై ఉండే మానవాళి - జీవరాశి అంతమైపోతుందా? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏమంటున్నారు?