Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ కలిగించని అగ్ర హీరోల సినిమాలు?

Advertiesment
kalki-gamechanger

డీవీ

, గురువారం, 6 జూన్ 2024 (10:59 IST)
kalki-gamechanger
అగ్ర హీరోల సినిమాలంటే ఫ్యాన్స్ లోనూ, ప్రేక్షకుల్లోనూ పెద్ద బజ్ క్రియేట్ అవుతుంది. కానీ కొన్ని సినిమాలు ఎందుకనో మొదటి నుంచి పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయాయి. అందులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ప్రభాస్ కల్కి సినిమాలు వున్నాయని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ తోపాటు భారతీయుడు సీక్వెల్ కూడా వస్తోంది. కానీ భారతీయుడుకి మించి కథ వుంటుందా? లేదా? అనేది అనుమానాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.
 
ఇక గేమ్ ఛేంజర్ విషయంలో విడుదలైన పాటలకు అనుకున్నంత స్థాయిలో  క్రేజ్ రాకపోవడం కరెక్టే అని ప్రముఖ పంపిణీదారుడు తెలియజేస్తున్నారు. ఇందులో తన తండ్రి సి.ఎం. అయితే పక్కన నమ్మినవారు చంపేయడం, ఆ తర్వాత వారిని పెరిగి పెద్దయ్యాక తల్లి అజంలి చెప్పిన నిజంతో ప్రత్యర్తులను మట్టుపెట్టడం అనేది కథగా ఇండస్ట్రీలో టాక్ వుంది. ఇలాంటి కథలు శేఖర్ కమ్ముల, మహేష్ బాబు సినిమాలు కూడా వచ్చేశాయి. అంతకుమించి వుంటేనే సినిమా హైప్ వస్తుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
 
ఇక కల్కి సినిమా హాలీవుడ్ సినిమా తరహాలో ఎవెంజర్స్ ఫార్మెట్ లో అధునాతన సాంకేకతతో రూపొందుతోంది. కానీ ఇందులో బుజ్జి అంటూ తయారు చేసిన కారును బాగా పబ్లిసిటీ ఇచ్చారు. అగ్ర తారాగణం వున్నారు. ఓ సైంటిస్ట్ నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. ఇలాంటి కథలలో ఫ్యూచర్ జనరేషన్ చూపించే ప్రయత్నం దర్శకుడు నాగ్ అశ్విన్ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కానీ ఇంతవరకు మార్కెట్ పరంగా పెద్దగా వర్కవుట్ కాలేదని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. 
 
ఇప్పటికే సలార్ తో ఓ మాదిరి హిట్ కొట్టిన ప్రభాస్ కు ఈ సినిమా మరో ఛాలెంజింగ్ లాంటిది. దీనిని ఓవర్ కమ్ చేయాలంటే హాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాలకు మించి ఈ సినిమా వుండాలనీ, సింగిల్ థియేటర్లలో ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో నని కొందరు ఎగ్జిబిటర్లు సందేహం వెలిబుచ్చారు. ఫైనల్ గాఏమి జరిగినా ఈ రెండు సినిమాలు సినిమా చరిత్రను మారుస్తాయని మరికొందరు తెలియజేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ గెలుపును తమ గెలుపుగా సెలెబ్రేట్ చేసుకుంటున్న టాలీవుడ్!!