శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి మద్దతివ్వను : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (09:01 IST)
వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు కొనసాగించే అంశంపై ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 
 
తన అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా, ఆయన మాట్లాడుతూ, తన వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని, సమయం వచ్చినపుడు ప్రకటిస్తానని తెలిపారు. కష్టాలు ఎక్కడుంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందన్నారు. అందుకే అనంతపురాన్ని దత్తత తీసుకున్నానని తెలిపారు.
 
నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తన దృష్టికి తెస్తే ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతపురం అభివృద్ధికి నీరే ప్రధానమన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. దానిపై ఉన్న ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. పరిటాల కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments