పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా : వైకాపా మంత్రి విశ్వరూప్

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (09:52 IST)
వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు ఏ విధంగా కోరుకుంటున్నారో అదే విధంగా తాను కూడా కోరుకుంటున్నట్టు వైకాపా మంత్రి, కోనసీమ జిల్లా నేత విశ్వరూప్ అన్నారు. ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆయన దర్శించున్నారు. 
 
ఆ తర్వాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడైనా పాదయాత్ర, వారాహి యాత్ర, బస్సుయాత్ర చేసుకోవచ్చని, ఇందులో తప్పేమి లేదన్నారు. పవన్‌ సీఎం కావాలంటే రాష్ట్రంలోని ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి 88 సీట్లు సాధించాలని, లేనిపక్షంలో వంద స్థానాల్లో పోటీచేసైనా 50 సీట్లలో గెలిచి సీఎం కావడానికి ప్రయత్నించాలని సూచించారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, నాలుగేళ్లలో ఒక్క మండలాన్నీ కరవు ప్రాంతంగా ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. నవరత్నాలతో పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని, మున్ముందు కూడా మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయన కృషిచ చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments