దుబాయ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆకుమర్తి జ్యోతి అరెస్ట్

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (19:26 IST)
దుబాయ్‌లో మహిళలను నిర్బంధిస్తూ మోసం చేస్తూ వ్యభిచారంలోకి దింపుతున్న ఆకుమర్తి జ్యోతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆమెను అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన 11మంది మహిళలు తమను ఈ మురికి కూపం నుంచి రక్షించాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేసారు.
 
ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఇండియన్ ఎంబసీ ద్వారా బాధిత మహిళలను ఏపీకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో ఆకుమర్తి జ్యోతిపై మొగల్తూరు, కలిదిండి, టి నరసాపురం పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న జ్యోతిని ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
వారు ఇచ్చిన సమాచారంతో జ్యోతిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నరసాపురం పోలీసుస్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఆకుమర్తి జ్యోతిది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు కావడం గమనార్హం. పోలీసు విచారణలో సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం