Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నువ్వు ఒక తల్లికి కొడుకువు అయితే, ఒక చెల్లికి అన్నవు అయితే?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (11:06 IST)
తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రైతుల నిరసన దీక్షలకు అమరావతి పరిరక్షణ సమితి సోషల్ కన్వీనర్ తుమ్మల కార్తీక్, కాంగ్రెస్ మహిళ నాయకులు సుంకర పద్మ శ్రీ,అజేయ్ కుమార్, డాక్టర్ సరిత తుళ్లూరులు మద్దతు తెలిపారు. 
 
ఇంకా దీక్షలో సుంకర పద్మశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మొహన్ రెడ్డీ అంటూ చెప్పు చూపించి సిఎం జగన్మొహన్ రెడ్డిని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న అంబటి రాంబాబును పిచ్చికాక మనమేమైనా జగన్మోహన్ రెడ్డి లాగా జైలుకు వెళ్లామా అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి అంటూ ఫైర్ అయ్యారు. 
 
జగన్మోహన్ రెడ్డికి డిజిపి చంచాగిరి చేస్తున్నాడు. జగన్ నువ్వు ఒక తల్లికి కొడుకువు అయితే, ఒక చెల్లికి అన్నవు అయితే, ఒక భార్యకు భర్తవు అయితే అంతమంది.. మహిళల కన్నీళ్లు పెట్టించవు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి మహిళలతో పెట్టుకోవద్దు. 
 
ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి ఏమైంది... బ్యూటీ పార్లర్‌లో వుందని ఇక్కడి మహిళలు కేసులు పెట్టారు. కేసులు పెట్టుకుంటారా ? ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకొండి మేం భయపడం. డాక్టర్ తుమ్మల కార్తీక్, అమరావతి పరిరక్షణ సమితి సోషల్ మీడియా కన్వీనర్ మాట్లాడుతూ.. రైతులు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. 
 
రైతుల కన్నీరు రాష్టానికే కాదు దేశానికి మంచిది కాదు. మీకు ఫోన్ నెంబర్ ఇస్తాం ఏ అవసరమైనా ఫోన్ చేస్తే వెంటనే అమరావతి పరిరక్షణ సమితి సభ్యులుగా వస్తాం. మూడు రాజధానుల నిర్ణయాన్ని పులివెందుల ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధాని అంటూ పేర్కొన్నారు. రైతుల పోరాటానికి ఐదు కోట్ల ప్రజలు మద్దతు పలుకుతున్నారు.

ఇక రైతుల మద్దగా విజయవాడ సివిల్ కోర్టు నుండి హైకోర్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. రైతుల మనోధైర్యం కోసేమే మేము మీ వెంటనే ఉంటాం. త్వరలోనే శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్ర చేపడతామని చెప్పారు. ఈ పోరాటం 29 గ్రామాల రైతుల ది కాదు రాష్ట్ర సమస్య. 29 గ్రామ రైతుల వెంట రాష్ట్రం ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments