ఏపీ మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పేర్ని నాని శుక్రవారం మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి రాజధాని తరలింపు అంశాన్ని పక్కనపెట్టారు. పైగా, గత ప్రభుత్వం శివరామకృష్ణన్ ఇచ్చిన కమిటీ నివేదికను కాదని నారాయణ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు అమరావతిని ఎంపిక చేశారని ఆయన ఆరోపించారు. ఈ భేటీ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్ర మంత్రి స్థానిక ఎన్నికల కోసం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కేబినెట్ నిర్ణయం. మార్చిలోగా కొత్త 108, 104 వాహనాలు కోనుగోలుకు కేబినెట్ అనుమతి. మొత్తం 130 కోట్లతో వాహనాలు కొనుగోలు. 341 వ్యవసాయ ఉత్పత్తుల శాశ్వత కొనుగోలు కేంద్రాల నడపాలని కేబినెట్ నిర్ణయం.
కనీస మద్దతు ధరకు నోచుకోని పసుపు, ఉల్లి, మిర్చి, చిరు ధాన్యాలు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాం. సిపెట్ సంస్థకు కృష్ణా జిల్లా సూరం పల్లిలో 6 ఎకరాల భూమి ఎకరా లక్ష చొప్పున కేటాయింపు. రాయచోటిలో వక్ఫ్ బోర్డు భవన నిర్ణయం. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు రైట్స్ సంస్థకు అప్పగింత. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం కోసం నిర్ణయం. రామాయపట్నం పోర్టుకు మౌలిక రాజధాని నిర్మాణంలో కుంభకోణంలు వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక.
అక్రమాలు జరిగినట్టు ప్రాథమికగా తేలింది. సమగ్ర దర్యాప్తు కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుని విచారణ చేయించేందుకు నిర్ణయం. గత ముఖ్యమంత్రికి, గత మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరుగుతుంది. జులై 2014లో కొనుగోలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.
రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను కేబినెట్‌లో చర్చ.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపునకు చెందిన అధ్యయన నివేదిక ఇంకా అందాల్సి ఉంది. రైతుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానుభూతితో ఆలోచిస్తుంది. వారికి కష్టం వస్తే ఏమి చేయాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఏకపక్షంగా ముందుకు వెళ్లం.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ భావిస్తోంది. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టి నారాయణ కమిటీ నివేదికను ఆమోదించింది. మౌలిక సదుపాయాలు ఏర్పాటు కోసం ఎకరాకు 2 కోట్ల చొప్పున 1 లక్షా 10 వేల కోట్లు అంచనా వేశారు.
కేబినెట్‌లో చర్చ తర్వాత జీఎన్ రావు కమిటీ, బీసీజి నివేదికను అధ్యయనం చేసేందుకు ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీల నివేదిక తరువాతే రాజధానిపై తదుపరి ప్రకటన ఉంటుంది. మంత్రులు, అధికారులతో కూడిన హైపవర్ కమిటీ ఏర్పాటు. ఎప్పటిలోగా ఈ కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందనేది త్వరలో ఉత్తర్వులు వెలువరిస్తాం.
రాజధాని ప్రకటన చేసే ముందు రైతుల అభిప్రాయాలు తీసుకునే నిర్ణయం తీసుకుంటాం. రైతులకు న్యాయం చేసేలానే ప్రభుత్వం వ్యవవహరిస్తుంది. రాజధాని రైతుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు ఎందుకు కోపం వచ్చిందో ప్రభుత్వానికీ తెలీదు. పౌరసత్వ బిల్లుపై ఆందోళనలను, సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది.
పరిస్థితులకు అనుగుణంగానే శాంతిభద్రతల కోసం పోలీసులు ఎక్కువ బందోబస్తు పెట్టారు. 2050 నాటికి 50లక్షల జనాభా అమరావతి వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఐదేళ్లలో ఎంతమంది అమరావతి తరలి వచ్చారు. చంద్రబాబు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు. జగన్ కట్టుకున్నాడు. ఐదేళ్లలో 5400 కోట్ల అప్పుకు 570 కోట్ల వడ్డీ కడితే, లక్ష 10 వేల కోట్ల అప్పుకు ఎంత వడ్డీ కట్టాలి అంటూ పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు.