Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయ పోరాటంతో వైసీపీ అన్యాయాలను ఎదుర్కొంటాం...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:54 IST)
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వైసీపీ కక్షసాధింపు రాజకీయాలకు బాధితుడైన మైనార్టీ నాయకుడు పఠాన్ ఖయ్యూమ్ ఖాన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ధైర్యం చెప్పారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడికి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం సెంటర్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల వైసీపీ నేతల కక్ష సాధింపులో భాగంగా అధికారులు కూల్చివేసిన ఖయ్యూమ్ ఖాన్ కు చెందిన దుకాణాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 

 
అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా చేపట్టిన దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారని కక్షకట్టి ఖయ్యూమ్ ఖాన్ దుకాణాన్ని రాత్రికి రాత్రి అధికారులతో కూల్చివేయించారని సోమిరెడ్డి చంద్ర‌బాబుకు వివరించారు. 
 

ఖయ్యూమ్ ఖాను కు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు న్యాయపోరాటానికి అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు  భరోసా ఇచ్చారు. ప్రజలతో పాటు ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని  టీడీపీ అధినేత దైర్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments