Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఏజెన్సీలో ఆపరేషన్ పరివర్తన.. 38 ఎక‌రాల్లో గంజాయి ధ్వంసం

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:57 IST)
విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా భారీగా గంజాయి తోట‌లను పోలీసులు ధ్వంసం చేశారు. 38 ఎకరాల్లో ర‌హ‌స్యంగా పండిస్తున్న గంజాయి తోటలు ధ్వంసం చేశారు. గూడెం కొత్తవీధి మండలం, దేవరపల్లి పంచాయతీకి చెందిన కుంకుమపూడి, చేరుకంపాకలు,  భూసులు గ్రామాలలో 38 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

 
జిల్లా ఎస్పీ  బి.కృష్ణారావు ఐపిఎస్., ఎస్.ఈ.బి, జె.డి ఎస్.సతీష్ కుమార్, ఆదేశాలు మేరకు ఎస్.ఈ.బి., ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ సిబ్బంది గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. గంజాయికి కేంద్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌యారైంద‌ని ఇటీవ‌ల ప్ర‌తిప‌క్షాలు ఆరోపించ‌డం, దీన్ని రాజకీయం చేయ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న ప్రారంభించారు.


దండులు దండులుగా విశాఖ ఏజెన్సీలో తిరుగుతూ, గంజాయి పండిస్తున్న ప్రాంతాల‌ను గుర్తిస్తున్నారు. దీనికి స్థానిక రైతుల స‌హకారాన్ని అర్థిస్తున్నారు. గంజాయి వేసిన వారి వివ‌రాలు తీసుకుని, వారినే పంట‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్ళి స్వ‌యంగా పంట‌ను ధ్వంసం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments