Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

80 ఏళ్లలో సముద్ర గర్భంలో విశాఖ కలిసిపోతుందా?

80 ఏళ్లలో సముద్ర గర్భంలో విశాఖ కలిసిపోతుందా?
, శుక్రవారం, 10 డిశెంబరు 2021 (13:41 IST)
విశాఖపట్నం 80 ఏళ్ల తర్వాత సముద్ర గర్భంలో కలిసిపోతుందని జాతీయ సముద్ర విజ్ఞాన శాస్త్ర కేంద్రం, వైజాగ్ మాజీ డైరెక్టర్, సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్త కేఎస్. మూర్తి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సముద్రపు కోతలు.. సముద్రంలో జరుగుతున్న పరిణామాలే  ఇందుకు కారణమని మూర్తి తెలిపారు.  
 
రాబోయే తరాలు విశాఖను చూడలేవని కేఎస్ మూర్తి వెల్లడించారు. ఎందుకంటే అప్పటికి ఆ నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. రచ్చబండ మీద కూర్చున్న వాళ్లు పొద్దుపోక చెప్పుకునే కబురు కాదిది అన్నారు. ఎంతో సుదీర్ఘ అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే నాలుగు దశాబ్ధాల పాటు పరిశోధనలు చేసిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ కూడా ఇదే హెచ్చరిక చేస్తోంది.
 
ఈ మధ్య కాలంలోనే ఐపీసీసీ తీవ్ర హెచ్చరికలు కూడా చేసింది. గ్లోబల్ వార్మింగ్‎తో పాటు ఇతర కాలుష్యాల వల్ల దేశంలో ఊహించని విధంగా వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయని తెలిపింది. సముద్రపు జలాలు భారీ స్థాయిలో పెరిగిపోయి.. దేశంలోని 12 కీలక తీరప్రాంత పట్టణాలు మునిగిపోతాయని హెచ్చరించింది. 
 
దీంతో మరో 80 ఏళ్లలో సముద్ర గర్భంలో విశాఖ చేరిపోయే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరగడం, వాతావరణ మార్పులతో మరో 80 ఏళ్లలో మూడు ఫీట్ల మేర సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ముంబై, మంగళూరు, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, తూత్తుక్కుడి, పారాదీప్, ఖిదీర్‌పూర్ లాంటి 12 నగరాలు సముద్రగర్భంలోకి వెళ్లనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజురోజుకూ పెరుగుతున్న ఒమిక్రాన్ భయం - ఫోన్లు స్విచాఫ్ చేసిన ప్రయాణికులు