Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

విశాఖ మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు.. కాశ్మీర్ అనుభూతి?

Advertiesment
Andhra Pradesh
, ఆదివారం, 19 డిశెంబరు 2021 (09:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం, ఏజెన్సీ (మన్యం) ప్రాంతాల్లో ఉష్ణోగ్రత్తలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా మన్యం తండాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో గడ్డకట్టించే చలి ఉండే అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గితే కాశ్మీర్ అనుభూతిని పొందవచ్చని పేర్కొంది. 
 
కాగా, శనివారం తెల్లవారుజామున విశాఖ చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో చలి తీవ్ర పెరిగింది. విజయవాడలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, చిత్తూరు జిల్లాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు ఉచిత వైద్యం.. సీఎం ఎంకే స్టాలిన్