పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా మారిన జగన్ బంధువు... ఎవరు?

ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:54 IST)
ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర్గీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భాషలో చెప్పాలంటే పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా వైవీ సుబ్బారెడ్డి తయారయ్యారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
 
ప్రకాశం జిల్లాలో వైకాపా అనేదిలేకుండా చేయడానికి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉన్న అస్తులు కరిగిపోయాయి... ఇప్పుడు మీకు నేను నాయకుడిగా పనికిరాలేదా... మీకు బానిసలు కావాలని ఇన్‌చార్జి పదవి వేరొకరికి ఇస్తారా? ఇది సమంజసమా? అంటూ నిలదీశారు. 
 
ముఖ్యంగా, అప్పుతెచ్చానో? ఉన్నదే కాజేసుకున్నానో నాలుగు కోట్లు పార్టీ కోసం వెచ్చించాను అంటూ వాపోయారు. దళితుల రక్తమాంసాల మీద ఎంపీ కోట కట్టుకుంటారా? ఒక్క దళితులకే కాదు, బీసీలకు అన్యాయం చేస్తావా? అంటూ వైవీనిని అశోక్ బాబు దునుమాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments