అనగనగా ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి.. ఒంగోలు సముద్రతీర పాకలో కాపురం
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి లేచిపోయి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. తమ పెళ్ళికి అంగీకరించని భావించిన వారిద్దరే ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి లేచిపోయి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. తమ పెళ్ళికి అంగీకరించని భావించిన వారిద్దరే ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పది రోజుల పాటు కాపురం కూడా చేశారు. చివరకు విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి స్వరాష్ట్రానికి పంపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 15 యేళ్ల వయసున్న ఓ బాలుడు, బాలిక ప్రేమించుకున్నారు. వీరిద్దూ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలిసి పారిపోయి ఒంగోలుకు వచ్చి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సముద్రతీరంలో ఓ పాకలో పది రోజులుగా కలసి ఉంటున్నారు. వీరిని చూసిన స్థానికులు వివరాలు అడిగి, ఇంటికి వెళ్లాలని చెప్పి, కోల్‌కతా వెళ్లే రైలు ఎక్కించారు.
అయితే, ఈ ప్రేమజంటను అనుమానించిన విజయవాడ చైల్డ్ లైన్ అధికారులు, అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు. సినిమాల ప్రభావంతో తాము రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించబోరన్న భయంతో, కొంత డబ్బు తీసుకుని పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. దీంతో నివ్వెరపోయిన అధికారులు... వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చారు.