సెహ్వాగ్ ఫైర్.. ఉమ్మడి కుటుంబంలో సంతోషం వుండదా? ఏంటి చెత్త చదువు?
డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా వున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో చమత్కారాలు పేల్చే సెహ్వాగ్.. తాజాగా ఓ పుస్తక కథనంపై ఫైర్ అయ్యాడు. ఇలాంటి పుస్తకాల ముద్రణకు అనుమతి ఇస్త
డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా వున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో చమత్కారాలు పేల్చే సెహ్వాగ్.. తాజాగా ఓ పుస్తక కథనంపై ఫైర్ అయ్యాడు. ఇలాంటి పుస్తకాల ముద్రణకు అనుమతి ఇస్తున్నారని ఫైర్ అయ్యాడు. ఇలాంటి చెత్తను మన పిల్లలు చదవాలా అంటూ ప్రశ్నించాడు. ఈ మేరకు ఓ పుస్తకానికి సంబంధించిన క్లిప్‌ను సెహ్వాగ్ పోస్టు చేశాడు.
ఇందులో ఉమ్మడి కుటుంబం అనే హెడ్డింగ్ కింద.. ఉమ్మడి కుటుంబంలో తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ, ఇంకా చాలా మంది పిల్లలు ఉంటారు. ఉమ్మడి కుటుంబం సంతోషకరమైన జీవితాన్ని ఎంజాయ్ చేయలేదని వుంది. దీనిపై సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతమున్న పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి చెత్త చాలా వుందన్నాడు. విద్యాశాఖ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇలాంటి పుస్తకాలు మార్కెట్లోకి వస్తున్నాయని మండిపడ్డాడు.