Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోడలకు, బల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్లు... ఎక్కడ?

సాధారణంగా పిల్లలకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు ఉంటారు. కానీ, ఆ పాఠశాలలో మాత్రం అందుకు విరుద్ధం. స్కూల్‌లో ఉండే 9 మంది ఉపాధ్యాయులు తరగతి గదులకు, బల్లలకు పాఠాలు చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్

Advertiesment
గోడలకు, బల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్లు... ఎక్కడ?
, శనివారం, 4 ఆగస్టు 2018 (11:18 IST)
సాధారణంగా పిల్లలకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు ఉంటారు. కానీ, ఆ పాఠశాలలో మాత్రం అందుకు విరుద్ధం. స్కూల్‌లో ఉండే 9 మంది ఉపాధ్యాయులు తరగతి గదులకు, బల్లలకు పాఠాలు చెబుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామంలో ఇలా జరుగుతోంది. 
 
ఈ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉండగా, ఇక్కడ మొత్తం 10 తరగతులు ఉన్నాయి. మొత్తం 9 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు ఉన్నారు. అయితే, ఒక్కరంటే ఒక్క విద్యార్థి లేడు. 2002కు ముందు ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న స్కూల్‌ను ఆపై అప్ గ్రేడ్ చేశారు. 
 
గత సంవత్సరం 6 నుంచి 10వ తరగతి వరకూ ఒక్కో తరగతిలో ఒక్కో విద్యార్థి మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం స్కూళ్లు తెరవగానే నలుగురు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. పదో తరగతిలో మిగిలిన ఒకే ఒక్క బాలిక కూడ గత నెలలో వెళ్ళిపోయింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, మరో 8 మంది రోజూ స్కూలుకు వచ్చి సాయంత్రం వరకూ ఖాళీగా ఉండి వెళ్లిపోతున్నారు. 
 
ఈ గ్రామంలో హైస్కూలు విద్య చదివే విద్యార్థుల సంఖ్య 18 మంది కాగా, వారంతా ప్రైవేట్ స్కూళ్లకే వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్కూల్ తెలుగు మీడియంలో ఉండటంతోనే ఎవరూ చేరడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ స్కూల్‌ను మూసేసి, ఉపాధ్యాయులను మరెక్కడికైనా బదిలీ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయాలి: తెలంగాణ మంత్రి కేటీఆర్