Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లితో అక్రమ సంబంధం .. కుమార్తెపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 జులై 2020 (17:23 IST)
కరోనా కష్టకాలంలోనూ కామాంధులు ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మహిళలు, అమ్మాయిలపై అకృత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ.. కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ఓ మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె కుమార్తెను రేప్ చేశాడు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గోపాల్ నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక గోపాల్‌ నగర్‌కు చెందిన సుభాని అనే వ్యక్తి.. అర్థవీడుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది క్రమంగా సహజీవనంగా మారిపోయింది. అయితే, ఈ మహిళకు మైనర్ కుమార్తె ఉంది. 
 
ఆమెపై సుభాని కన్నేశాడు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఆ యువతిపై లైంగికదాడికి తెగబడ్డాడు. తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, స్థానిక దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఓ మైనర్‌ బాలిక ఫిర్యాదు చేసింది. 
 
జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పినా పట్టించుకోలేదని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో ఆ బాలిక భయపడి తల్లిని వదిలి అమ్మమ్మ ఇంట్లో తలదాచుకుంది. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పడంతో అమ్మమ్మ సహకారంతో దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments