Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

మైనర్ బాలికకు అబార్షన్ చేసి.. పిండాన్ని చెత్తలో పడేసిన వైద్యుడు

Advertiesment
Gujarat
, సోమవారం, 20 జులై 2020 (20:29 IST)
గుజరాత్ రాష్ట్రానికి చెందిన వైద్యుడు పైశాచికంగా ప్రవర్తించాడు. 15 యేళ్ల మైనర్ బాలికకు అబార్షన్ చేసిన వైద్యుడు... ఆ పిండాన్ని ఇంటికి వెళ్తూ ఓ చెత్త కుండీలో పడేశాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ వైద్యుడితో పాటు మైనర్ బాలిక గర్భందాల్చడానికి కారణమైన యువకుడిని కూడా అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు.. ఓ మైనర్ బాలికకు అబార్షన్ చేశాడు. ఇందుకోసం రూ.15 వేల ఫీజు పుచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ పిండాన్ని తనతో తీసుకెళ్తూ కారులోంచి చెత్తలో పడేశాడో డాక్టర్. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు డాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమంగా అబార్షన్ చేసినందుకు వైద్యుడిని అరెస్టు చేశారు. అలాగే బాలిక గర్భానికి కారణమైన ఓ 19ఏళ్ల కుర్రాడిని కూడా పట్టుకున్నారు. అతనిపై అత్యాచారంతోపాటు పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
అత్యాచారానికి యత్నించి.. ఆపై హత్య
మరోవైపు, హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్‌ ఉద్యోగిని హేమలత హత్యకు గురైంది. ఆమెను సహోద్యోగి వేంకటేశ్వరరావు హత్య చేశాడు. 
 
పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి హేమలతపై వెంకటేశ్వరరావు అత్యాచారం చేయబోగ ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆమె ఎవరితో అయినా చెప్తుందన్న భయంతో హేమలత మెడకు చున్నీ బిగించగా.. ఊపిరాడక ఆమె చనిపోయింది. 
 
ఇది గమనించిన స్థానికులు వేంకటేశ్వరరావును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాను పగబట్టిన కరోనా వైరస్ : ఒక్క రోజులోనే 54 మంది మృత్యువాత