Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రీ క్యాపిటల్స్ బిల్లు ఆమోదించవద్దు : ఆర్ఎస్ఎస్ నేత రతన్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (17:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశం సజావుగా పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. ఈ త్రీ క్యాపిటల్స్‌కు ఒక్క అధికార వైకాపా మినహా.. మిగిలిన ఏ ఒక్క పార్టీ అంగీకరించడం లేదు. ఇపుడు మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తున్న జాబితాలో ఆర్ఆర్ఎస్ కూడా చేరిపోయింది. 
 
మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారదా ట్వీట్ చేశారు. ఆ బిల్లులను తిరస్కరించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
మూడు రాజధానులు అనేది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందువల్ల ఆ బిల్లును తిరస్కరించాలని ఆయన గట్టిగా కోరారు. 
 
ఇప్పటికే, మూడు రాజధానుల బిల్లులు రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాక, శాసనమండలిపై జగన్ పైచేయి సాధించాలనుకుంటున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. వనరులు వృథా కాకుండా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments