Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతాం: సీఆర్పీఎఫ్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:03 IST)
కేంద్ర ప్రభుత్వం   మార్గదర్శకాల ప్రకారం  దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సిఆర్పిఎఫ్ నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం, లాలా చెరువు లోని సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటుతున్న ట్లు  సతీష్ కుమార్ తెలిపారు.

గురువారం రాజమహేంద్రవరం లోని ఆవ రోడ్డు లో ఉన్న వాంబే గృహాల లో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీ.ఆర్. పి.ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్  మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది అంతా నిరంతరం  కొనసాగుతుందని తెలిపారు. ఈఏడాది ఆఖరు నాటికి సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ తరపున 10,000 మొక్కలు నాటు తామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధానాన్ని తమ  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు.  మొక్కలు నాటి వాటిని సంరక్షించి,  పెంచినట్లైతే  పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమీ డి డి ఎం. వి ప్రసాద్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ  ప్రసాద్, సిల్వి కల్చరిస్ట్ ఎల్.భీమయ్య,  సీలేరు, డొంకరాయి, చింతూరు, సిఆర్పిఎఫ్ బెటాలియన్. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments