దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తాజా కేసుల సంఖ్య 1.5లక్షలకు దిగువన నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,32,788 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే క్రితం రోజు(1,27,510)తో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త పెరిగింది. క్రితం రోజు 2,795 మరణాలు సంభవిస్తే.. తాజాగా ఆ సంఖ్య 3,207కి చేరింది.
♦ తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,83,07,832.
♦ గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో పోరాడుతూ 3,207 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,35,102.
♦ గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే రకవరీలే అధిక సంఖ్యలో ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా 2,31,456 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,61,79,085కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 92.48 శాతంగా ఉంది.
♦ ప్రస్తుతం దేశంలో 17,93,645 క్రియాశీల కేసులు ఉన్నాయి.
♦ గడిచిన 24 గంటల్లో 20,19,773 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 35 కోట్లకు చేరింది.
♦ దేశంలో ఇప్పటి వరకూ 21,85,46,667 టీకాలు ఇచ్చారు.