Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ భయం : కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన ఏపీ సర్కారు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:22 IST)
ఇపుడు ప్రపంచ ప్రజలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. కొత్త ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కేంద్ర హోం శాఖతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, మాస్కులు లేని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగమాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సదరు వ్యాపార, వాణిజ్యం సంస్థలను రెండు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments