Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక రాముడుకి వాడవాడలా నివాళి... ఎన్టీఆర్ 26వ వర్ధంతి

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (18:52 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్థంతిని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించాయి. వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలవేసి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నివాళులర్పించారు.  జోహార్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల అన్నదానాలతో పాటు రక్తదానాలు నిర్వహించి వస్త్ర వితరణతో పాటు రోగులకు పండ్లు అందించారు. 
 
 
విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్థంతిని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాళులర్పించి ప్రసంగించారు. విశాఖపట్నంలో 94వ డివిజన్ లో మాజీమంత్రి బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. విశాఖ తూర్పులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లిలో పీలా గోవింద్, ఎలమంచిలిలో బుద్ధా నాగజగీదశ్వరరావు పార్టీ జెండాలను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాడుగులలో ఇంఛార్జి పీవీజీ కుమార్, విశాఖ టౌన్ లో పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

 
ఎచ్చెర్లలో పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, ఆముదాలవలసలో మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాసలో గౌతు శిరీష ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, ఇచ్చాపురంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించారు. 

 
విజయనగరం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి కార్యకర్తలతో కలిసి మాజీకేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు నివాళులర్పించారు. సాలూరులో పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించి, నివాళులర్పించారు. కోవిడ్ సోకడం వల్ల బొబ్బిలి ఇంఛార్జి బేబినాయన తన నివాసంలోనే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్వతీపురంలో ద్వారపురెడ్డి జగదీష్ పాల్గొన్నారు. 

 
కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రక్తదానం, అన్నదానాన్ని పెద్దఎత్తున చేపట్టారు. విజయవాడ నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కిలారి నాగశ్రవణ్ పాల్గొన్నారు. జిల్లా కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, మచిలీపట్నంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీఎంపీ కొనకళ్ల నారాయణ పెడనలో కాగిత కృష్ణప్రసాద్, నందిగామలో తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. విజయవాడ సెంట్రల్ లో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అవనిగడ్డలో శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, కైకలూరులో మాజీ ఎమ్మెల్యే జయమంగళ ఆదేశాల మేరకు నాయకులు వర్థంతి వేడుకలు నిర్వహించారు. గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందిన పలువురికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నూజివీడులో ఇంఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, జగ్గయ్యపేటలో శ్రీరాంరాజగోపాల్ తాతయ్య, తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు వర్థంతి వేడుకల్లో పాల్గొన్నారు. 
 
 
రాజమండ్రి సిటీలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆదిరెడ్డి  శ్రీనివాస్ ఆద్వర్యంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. రాజమండ్రి రూరల్ లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని ప్రసంగించారు. జగ్గంపేటలో జ్యోతులు నెహ్రు దంపతులు, ప్రత్తిపాడులో ఇంఛార్జి వరపుల రాజా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కాకినాడలో పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతిల నవీన్ పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. తణుకులో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, తుణిలో యనమల కృష్ణుడు, కాకినాడలోని తన నివాసంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రారావు నివాళులర్పించారు. కాకినాడ సిటీలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మహిళలకు చీరల పంపిణీ చేశారు. రంపచోడవరంలో వంతల రాజేశ్వరి ఆదేశాల మేరకు పార్టీ నేతలు వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు, అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ చేశారు.   

 
పశ్చిమ గోదావరి బీమడోలులో ఏలూరు పార్లమెంట అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉండిలో ఎమ్మెల్యే రామరాజు, కొక్కిరిపాడులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నివాళులర్పించారు. ఏలూరు పట్టణంలో బడేటి చంచి, పోలవరంలో బొరగం శ్రీనివాసులు, తాడేపల్లిగూడెంలో వలవల బాబ్జీ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి అన్నదానం చేశారు. నర్సాపురంలో పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ.షరీఫ్, ఆచంటలో మాజీమంత్రి పితాని సత్యనారాయణ ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంతంరం కరోనా బారిన పడిన చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 
 
 
గుంటూరు జిల్లాలో వర్థంతి వేడుకల్లో పలువురు నేతలు స్వయంగా రక్తదానం చేశారు. గుంటూరు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నాయకులు రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీమంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పశ్చిమ ఇంఛార్జి కోవెలమూడి నాని పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నివాళులర్పించి అన్నదానం చేపట్టారు. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వేమూరులో మాజీమంత్రి నక్కా ఆనందబాబు, బెల్లంకొండలో మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ నివాళులర్పించారు. బాపట్లలో వేగేశన నరేంద్రవర్మ ఐలాండ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నరసరావుపేటలో జీవీ ఆంజనేయుల, చదలవాడ అరవింద్ బాబు మెగా రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. జీవీ ఆంజనేయులు స్వయంగా రక్తదానం చేశారు. సత్తెనపల్లిలో తారకరామ్ సాగర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద యువనేత కోడెల శివరామ్, దాచేపల్లిలో యరపతినేని శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక నేతలు వర్థంతి కార్యక్రమాన్ని చేపట్టారు.
 
ప్రకాశం జిల్లాలో ఎన్టీఆర్ వర్థంతిని ఘనంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. పలుచోట్ల వైద్య శిభిరాలను ఏర్పాటు చేశారు. పర్చూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని ప్రారంభించారు. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ప్రసంగం అనంతంరం అన్నదానం చేపట్టారు. ఒంగోలు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వేముల కోటలో అన్నదానం చేశారు. కంభంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ ను మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి కార్యకర్తల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నందిపాడులోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బీఎన్.విజయ్ కుమార్ నివాళలర్పించారు. కొండపిలో ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి, యువనేత దామచర్ల సత్య, ఎర్రగొండపాలెంలో ఎరిక్షన్ బాబు, కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం అన్నదానం చేశారు.  దర్శిలో ఇంఛార్జి పమిడి రమేష్ కార్యకర్తలతో పెద్దఎత్తున వెళ్లి ఎన్టీఆర్ కు నివాళి అర్పించి, అన్నదానం చేపట్టారు. 
 
పాణ్యంలో గౌరు వెంకటరెడ్డి, చరితా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కర్నూలు పట్టణంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ.భరత్, మంత్రాలయంలో పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, డోన్ లో కె.ఇ. ప్రభాకర్ ఆద్వర్యంలో ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీ.వీ.జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు.

 
నెల్లూరు పట్టణంలోని నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆనం వెంకటరమణారెడ్డి నివాళులర్పించారు. 39వ డివిజన్ లో నెల్లూరు రూరల్, టౌన్ ఇంచార్జిలు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరిలో ఇంఛార్జి కురుగొండ్ల రామకృష్ణ నివాళులర్పించిన అనంతరం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కోవూరులో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఘనంగా నిర్వహించి, అన్నదానం చేశారు. సర్వేపల్లిలో పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కావాలిలో బొల్లినేని రామారావు, గూడురులో పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నివాళులర్పించారు. 
 
 
కడప జిల్లా పులివెందుల్లో ఎమ్మెల్సీ బీ.టెక్.రవి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్థంతిని చేపట్టారు. కడప పట్టణంలో ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానంలో ఇంఛార్జి అమీర్ బాబు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి, బద్వేల్ లో కొండ్రెడ్డి విజయమ్మ ఆదేశాల మేరకు నాయకులు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.
 
 
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో ఇంఛార్జి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 1000 ఎన్టీఆర్ ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రక్తదాన శిభిరం నిర్వహించి 700 వందల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రాయదుర్గంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 350 మందికిపైగా యువకులు రక్తదానం చేశారు. గుంతకల్లులో ఇంఛార్జి జితేందర్ గౌడ్ ఆద్వర్యంలో వర్థంతిని నిర్వహించి రోగులకు పళ్లు అందించారు. మడకసిరలో మాజీ ఎమ్మెల్యే కె.ఈరన్న నివాళులర్పించారు. తాడిపత్రిలో ఇంచార్జి జేసీ అస్మిత్ రెడ్డి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణులకు పండ్లు పంపిణీ చేశారు.  ఉరవకొండ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ పటాలకు నివాళులర్పించారు.
 
 
చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఘనంగా ఎన్టీఆర్ వర్థంతిని నిర్వహించారు. పేదలకు భోజన పొట్లాలను అందించారు. పుంగనూరులో ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి కూడలిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించి, రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. పేదలకు ఆహార పొట్లాలు అందించారు. అనంతరం కోవిడ్ బారిన పడ్డ చంద్రబాబు, లోకేష్ త్వరగా కోలుకోవాలని శ్రీవారి పాదాల వద్ద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. సత్యవేడులో మాజీ ఎమ్మెల్యే హేమాలత, శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments