Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"చింతామణి" నాటక ప్రదర్శనపై ఏపీ సర్కారు నిషేధం!

Advertiesment
, మంగళవారం, 18 జనవరి 2022 (16:08 IST)
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో చింతామణి నాటకం అంటే తెలియనివారుండరు. పట్టణాలు, పల్లెల్లో అంతగా ప్రాచూర్యం పొందింది. ఇపుడు ఈ చింతామణి వీధి నాటకం ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. ఒక వేళ ప్రదర్శిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 
కాగా, ఈ నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర తమ మనోభవాలను కించపరిచేలా ఉందని, అందువల్ల ఈ నాటక ప్రదర్శనపై నిషేధం విధించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సర్కారు.. నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దగాపడిన ఉద్యోగులకు మద్దతుగా హస్తినలో "ఆర్ఆర్ఆర్" దీక్ష