అమరావతి ప్రజల కోసం కాదు.. మంత్రి బొత్స

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:23 IST)
రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి ప్రజల కోసం నిర్ణయం తీసుకోలేదన్నారు. అది కొందరి ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీని కాదని.. నారాయణ కమిటీ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని గతంలోనే చెప్పామన్నారు. ఇప్పుడూ అదే చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

8 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే రాజధాని మునిగిపోతే.. ఒకవేళ పదేళ్ల క్రితం వచ్చినట్లు మళ్లీ వరద వస్తే అమరావతి ఏమవుతుంది? అని ప్రశ్నించారు. ఇటీవల రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

త్వరలో అమరావతిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్న ఆయన వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అమరావతిపై ఏదో ఒకటి తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని రైతులు కూడా పోరాటానికి సిద్ధపడుతున్నారు.

విపక్షాల మద్దతు కూడబెడుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ అమెరికా పర్యటన ముగించుకుని శనివారం తాడేపల్లి చేరుకున్నారు. ఈ తరుణంలో మరోసారి బొత్స చేసిన వ్యాఖ్యలను బట్టి రాజధానిపై ఏదో జరుగుతుందన్న సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments