సైబర్ పోలీసులకు జనసేన ఫిర్యాదు

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (19:21 IST)
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని రూ.2వేల కోట్ల బ్లాక్‌మనీని జనసేన మార్చుకుందంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు మండిపడ్డారు.

దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా విభాగంపై జనసేన నేతలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో జనసేనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు ఆ పార్టీ వెల్లడించింది.

తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకుంటున్నారంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను అరెస్ట్‌ చేయాలని పోలీసులను కోరారు.

తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా ముందుకు వెళ్లాలని జనసేన లీగల్ సెల్‌ను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరడంతో వాళ్లు పోలీసులకు ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments