Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం అవిశ్వాసానికి వైకాపా మద్దతు... ఇతర పార్టీలు కూడా

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్ష వైకాపా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి

Webdunia
శుక్రవారం, 16 మార్చి 2018 (18:17 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్ష వైకాపా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. 
 
ఇదే అంశంపై శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన విజయసాయి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీకైనా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై తామూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరినట్లు చెప్పారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వదంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 
 
కాగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం, ఆప్, బిజూ జనతా దళ్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. అలాగే, అన్నాడీఎంకే, తెరాస పార్టీల మద్దతును కూడగట్టే పనిలో టీడీపీ ఎంపీలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments