Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి పెరుగుతున్న మద్దతు

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి క్షణక్షణానికి మద్దతు పెరుగుతోంది. నిజానికి వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈ అవిశ్వాస తీర్మానాన్ని తొలుత

Advertiesment
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి పెరుగుతున్న మద్దతు
, శుక్రవారం, 16 మార్చి 2018 (17:15 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి క్షణక్షణానికి మద్దతు పెరుగుతోంది. నిజానికి వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈ అవిశ్వాస తీర్మానాన్ని తొలుత ప్రవేశపెట్టారు. అయితే, తెలుగుదేశం పార్టీ ఈ అవిశ్వాస తీర్మాన అంశాన్ని తెరపైకి తీసుకుని రావడంతోనే ఢిల్లీలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయింది.
 
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలతో పాటు లెఫ్ట్ పార్టీలు, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. అంతేకాకుండా, టీడీపీకి చెందిన ఎంపీలు ఇతర చిన్నాచితక పార్టీల మద్దతు కూడగట్టేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ఇదిలావుండగా, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, తమకు మద్దతుగా ఇతర పార్టీలను కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ  ఫోన్ చేసినట్టు సమాచారం. 
 
టీడీపీ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ప్రకటిస్తున్నట్టు ములాయం పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడాన్ని స్వాగతిస్తున్నామని, విపత్తు నుంచి దేశాన్ని కాపాడటానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని చంద్రబాబుతో మమతా బెనర్జీ అన్నట్టు సమచారం. 
 
కాగా, కేంద్రంపై టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇరవై విపక్ష పార్టీలతో కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే, ఆజాద్, జ్యోతిరాదిత్య సింథియా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతకం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు సర్కారుకు పవన్ అల్టిమేటం.. 48 గంటల డెడ్‌లైన్