Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరికి మర్కజ్‌కు లింకు.. హైఅలెర్ట్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (12:47 IST)
గుంటూరు జిల్లా మంగళగిరికి నిజాముద్దీన్ మర్కజ్‌కు లింకు ఉన్నట్టు తేలడంతో పోలీసులతో పాటు.. అధికారులు హైఅలెర్ట్ ప్రకటించారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు.
 
అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు. 
 
మరోవైపు, బుధవారం ఏపీలో మొత్తం 67 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments