Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (19:30 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 13 ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఇళ్లలో ఉన్న సెల్‌ఫోన్స్‌, పుస్తకాలు, హార్డ్ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

అల్వాల్, నాగోల్, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లిలో సోదాలు కొనసాగుతున్నాయి. బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు.

అపార్ట్‌మెంట్‌లో ఓయూ విద్యార్థులు ఉంటున్నారని సమాచారంతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. నారాయణగూడలోని అంబికా టవర్స్‌లో లేడీస్ హాస్టల్‌లోనూ సోదాలు చేశారు.

నాగోల్‌లో రవిశర్మ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆయన మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.

అల్వాల్ సుభాష్ నగర్‌లో నివాసముంటున్న.. అమరుల బంధుమిత్రుల సంఘం నేత పద్మ కుమారి, భవాని ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. పద్మను పోలీసులు విచారిస్తుండగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో పుస్తకాలు, వస్తువులను పోలీసులు చిందరవందరగా పడేశారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments