Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ - తిరుపతిల మధ్య వందే భారత్ రైలు...

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (08:49 IST)
విశాఖపట్టణం - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి మొత్తం 16 బోగీలతో కూడిన వందే భారత్ రైలు విశాఖపట్టణంకు బయలుదేరింది. ఇదే విషయంపై వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులను సంప్రదిస్తే మాత్రం.. అలాంటిదేం లేదని వారు అంటున్నారు. 
 
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ఈ రైళ్ళలో ఏదేని సాంకేతిక సమస్య తలెత్తితే ఈ రైలును రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా సాధారణ రైలును నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తరచూ ఇలా జరుగుతుండంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మరో రేక్‌ను చెన్నై నుంచి రప్పిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ రైలును విశాఖ - తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై రైల్వే శాఖ నుంచి వివరణ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments