Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెహ్రాడూన్‌లో ఘోరం.. లోయలో పడిన యాత్రికుల బస్సు

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (21:20 IST)
ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ  ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, మరో 27మందికి గాయాలయ్యాయి. సుమారుగా 40 మంది ప్రయాణికులతో ఉత్తరాక్షి నుంచి గంగోత్రి వైపు వస్తున్న బస్సు ఒకటి గంగనమి వద్ద లోయలో పడిపోయింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. 
 
ప్రమాద వార్త తెలియగానే, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు, వైద్య సిబ్బంది ప్రస్తుతం అక్కడే ఉన్నట్టు చెప్పారు. సహాయక చర్యల కోసం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగానే ఓ హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేసి ఉంచామన్నారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో గాయపడిన సునీల్ శెట్టి...

ధర్మం కోసం జితేందర్ రెడ్డి ఏం చేశాడు.. రివ్యూ

మట్కా లో అదే నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది : జివి ప్రకాష్ కుమార్

ఐఫా వేడుకల్లో తేజ సజ్జా - రానా కామెంట్స్.. సారీ చెప్పాలంటూ మహేశ్ ఫ్యాన్స్ డిమాండ్...

ఘాటి నుంచి అనుష్క శెట్టి స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments