Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నచ్చలేదు.. మూడు నెలల గర్భవతి.. ఉరేసుకుని ఆత్మహత్య

ప్రేమ వివాహాలు, అక్రమ సంబంధాలు నేరాలకు కారణమవుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేదని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు అక్రమ సంబంధాలతో నేరాలు చేస్తున్నారు. ఇటీవల భర్తతో కాపురం చేయ

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (11:46 IST)
ప్రేమ వివాహాలు, అక్రమ సంబంధాలు నేరాలకు కారణమవుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేదని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. మరికొందరు అక్రమ సంబంధాలతో నేరాలు చేస్తున్నారు. ఇటీవల భర్తతో కాపురం చేయకుండా.. రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్వాతి.. భర్తను హతమార్చి.. చిప్పకూడు తింటున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా భర్త తనకు నచ్చలేదని.. మౌనిక అనే మహిళల పెళ్లైన మూడు నెలలకే ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దలు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారో తెలియదు కానీ పెళ్లయిన నాలుగు నెలలకే ఓ నవ వధువు తన ప్రాణాలు తీసుకుంది. మరణించే ముందు తన నిర్ణయానికి కారణాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కలకలం రేపిన ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 30వ వార్డులో ఉండే రైల్వే పార్శిల్‌ సర్వీస్‌ ఉద్యోగి ఉద్దండి వీరవెంకటనాగేశ్వరరావు కుమార్తె మౌనిక (24). ఆమెకు గత ఆగస్టులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి, ఒంగోలుకు చెందిన తిరుమలశెట్టి నరేంద్రతో వివాహం జరిగింది. పెళ్లికి తర్వాత మౌనిక, నరేంద్ర బెంగళూరులో కాపురం పెట్టారు. ఆపై ఆమె గర్భవతికాగా, నెల రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. 
 
బెంగళూరులో ఏం జరిగిందో ఏమో.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకన్నా ముందు భర్త అంటే తనకు ఇష్టం లేదని, అందుకే చనిపోతున్నానని వీడియో రికార్డు చేసింది. మౌనిక ఆత్మహత్యపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, వీడియోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం