జగన్ వల్ల కానిది మోహన్ బాబుకి సాధ్యమైంది.. ఎలా?

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (15:40 IST)
వైకాపా పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితో 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పార్టీ తరఫున కలెక్షన్ కింగ్, సినీ నటుడు డాక్టర్ ఎం. మోహన్ బాబు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులను, అదేవిధంగా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకుని మోహన్ బాబు చేసిన విమర్శలు చేశారు. అవి అపుడు ఎన్నికల ప్రచారంలో హైలెట్ అయ్యాయి. 
 
ముఖ్యంగా చంద్రబాబు తాను అధికారంలో ఉన్న సమయంలో తన విద్యా సంస్థలకు సంబంధించి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మోహన్ బాబు ఆరోపించారు. ఆ తర్వాత ఎన్నికలకు నెల రోజులు ఉందనగా జగన్ పార్టీలో చేరిపోయారు. ఈనేపథ్యంలో గత కొన్ని నెలల నుండి జగన్ పార్టీకి దూరంగా ఉంటున్నా మోహన్ బాబు సడన్‌గా ఢిల్లీలో నరేంద్ర మోడీని కలవడం జరిగింది. దాదాపు అర గంటకు పైగా ప్రధాని మోడీతో మోహన్ బాబు ఆంధ్ర రాజకీయాల గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. 
 
అంతేకాకుండా త్వరలోనే బిజెపి పార్టీలో చేరడానికి మోహన్ బాబు రెడీ అవుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా మోహన్ బాబు కలిశారు. 
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వల్ల కానిది మోహన్ బాబుకి ఇలా డిల్లీ వెళ్లడంతో అలా అపాయింట్మెంట్ ప్రధాని మోడీ, అమిత్ షా దగ్గర దొరకటంతో ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. 
 
మొత్తంమీద చూసుకుంటే ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు జగన్‌కి వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో అప్పట్లో మోడీని, అమిత్ షాని కలవడానికి జగన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా, సరిగ్గా కనీసం పట్టించుకోవడం లేదు. ఇటువంటి తరుణంలో లక్కీగా మోహన్ బాబుకి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటం నిజంగా హైలెట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments