Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీతో మోహన్‌బాబు కుటుంబం భేటీ

మోదీతో మోహన్‌బాబు కుటుంబం భేటీ
, సోమవారం, 6 జనవరి 2020 (16:38 IST)
సినీ నటుడు మోహన్‌బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణు, కోడలు విరోనికతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం భేటీ అయ్యారు. 
 
ఈ భేటీతో ఆయన బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మోహన్‌బాబును బీజేపీలోకి ఆహ్వానించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ప్రధానితో మోహన్‌బాబు దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిపినట్లు తెలిసింది. 
 
మోదీతో భేటీ తర్వాత మంచు లక్ష్మి ఈ సమావేశానికి సంబంధించి ట్వీట్ చేసింది. ఇప్పుడే డైనమిక్‌ ప్రధాని మోదీని కలిశామని, మోదీ సారధ్యంలో భారత్‌ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. 
 
ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోహన్‌బాబు భేటీ కానున్నట్లు సమాచారం. సోమవారం నెలకొన్న ఈ తాజా పరిణామాలతో మంచు కుటుంబం వైసీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్యన్నపాత్రుడికి బెయిల్‌ - అయినా జిల్లాకురాని మాజీ మంత్రి