Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికలు : టీడీపీ బలంతో గెలిచి వైకాపాలో జంప్

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (11:23 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే రెండు దశలు ముగిసిపోయాయి. బుధవారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. అయితే, తొలి, రెండు దశల ఎన్నికల్లో గెలుపొందిన పలువురు అభ్యర్థులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ బలం, మద్దతుతో గెలుపొంది, ఇపుడు అధికార పార్టీలోకి దూకేస్తున్నారు. 
 
తాజాగా నెల్లూరు జిల్లాలో ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలోని ఆత్మకూరులో రెండో విడతలో భాగంగా శనివారం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. 
 
సంగం మండలం చెర్లోవంగుల్లులో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. 
 
అదేవిధంగా ఏఎస్‌పేట మండలం పెద్దబ్బీపురానికి చెందిన ఎ.మాధవరెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆదివారం ఆయన మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఇదే మండలంలోని చౌటభీమవరం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో విజయం సాధించిన లక్ష్మీనారాయణ కూడా వైసీపీలో చేరడం గమనార్హం. దీంతో వారి గెలుపునకు కృషి చేసిన టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments