Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం : ఒకే గ్రామంలో 16 మందికి కరోనా

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్ల నిర్లక్ష్యం కూడా ఈ వైరస్ వ్యాప్తికి ఓ కారణంగా నిలుస్తోంది. తాజాగా ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన నిర్లక్ష్యం వల్ల మరో 16 మందికి ఈ వైరస్ సోకింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలోని బట్లమాగుటూరు అనే గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్ఎంపీ వైద్యుడుగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఈ గ్రామంలో అనేక మందికి వైద్యం చేస్తూ వచ్చాడు. అయితే, ఈయన వైద్యం చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామానికి వెళుతూ వచ్చేవాడు. 
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వచ్చిన వైద్యుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వైద్యం చేసిన గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు ఈ వైద్యుడు కారణంగా 16 మంది గ్రామస్తులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సెకండ్ కాంటాక్టర్‌ను గుర్తించే పనిలోపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments