Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి కన్నబాబుకు నాన్‌బెయిలబుల్ వారెంట్

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వైకాపాకు చెందిన ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హెరిటేజ్ సంస్థ పరువునష్టం కేసు విచారణకు వీరిద్దరూ హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేశారు. 
 
ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. గతంలో హెరిటేజ్ సంస్థపై కన్నబాబు, అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసింది. 
 
ఈ కేసు విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతోంది. అయితే, విచారణకు వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. 
 
అటు, హెరిటేజ్ అధికారి సాంబమూర్తి కూడా విచారణకు గైర్హాజరవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాగైతే కేసు మూసివేస్తామని గత విచారణలో స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో కన్నబాబు, అంబటి రాంబాబులకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీచేసింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments