Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

చంద్రబాబుకు సిగ్గు ఉంటే ఓటమిని అంగీకరించాలి : మంత్రి వెల్లంవల్లి

Advertiesment
AP Minister Vellampalli
, ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (17:12 IST)
గ‌త ఐదేళ్లుగా టిడిపి న‌గ‌ర అభివృద్దిని గాలికి వ‌దిలేసింద‌ని, సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి విజయవాడ నగర అభివృద్దికి 600 కోట్ల రూపాయ‌లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం 41వ డివిజను అభ్య‌ర్థితో క‌లిసి భవానీపురం, స్వాతీ సెంటర్, లలితానగర్ త‌దిత‌ర ప్రాంతాల్లో మంత్రి ప్ర‌చారం నిర్వ‌హించారు. 
 
 
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అహంకారంతో ప్రజలను, అభివృద్దిని విస్మరించార‌న్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తాను అని పగటి కలలు కంటున్నారు అని ఎద్దెవా చేశారు. ప్రజలు ఛీ కొట్టిన చంద్రబాబు బుద్ధి మారలేదన్నారు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి జగన‌న్న అన్నారు. 
 
చంద్రబాబు ఇప్పటికైనా పద్దతి మార్చుకొని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాల‌ని హితువు ప‌లికారు. ప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చెసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరన్నారు. అదేవిధంగా ప‌శ్చిమలో క్యాంబే రోడ్డు, అప్నాబ‌జార్ త‌దిత‌ర ప్రాంతాల‌ను అభివృద్ది చేస్తామ‌న్నారు. 
 
కావాల‌నే కొంద‌రు ప‌నిగ‌ట్టుకుని అస‌త్యాల‌ను ప్రచారం చేస్తున్నారు అని, ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు అని, ఓటుతో వీరికి బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. టిడిపి, జ‌న‌సేన‌, బిజేపి అన్నీ ఒకే కూట‌మి చెందిన‌వి అని, ఈ పార్టీలు అధికారంలో ఉంటే ఒక మాదిరిగా లేక పోతే మ‌రో మాదిరిగా ప్ర‌వ‌ర్తించ‌డం క‌రెక్ట‌ర్ కాద‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా జిల్లా కలెక్టర్‍ బదిలీ వేటు తప్పదా?