Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 30వ తేదీన నాసా అంగారకుడి యాత్ర

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (19:47 IST)
NASA
అంగారకుడిపై ఇప్పటికే ఎనిమిది సార్లు విజయం సాధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా).. తాజాగా ఈ నెల 30వ తేదీన అంగారకుడి యాత్రకు మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ నెల 30న మరో రోవర్​ను అంగారకుడి వద్దకు పంపనుంది. అంగారకుడిపై ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో ఈ 'పెర్​సీవరెన్స్​' అతిపెద్దదని, అత్యంత మేధస్సు కలిగినదని నాసా పేర్కొంది.
 
ఈ రోవర్​ ల్యాండింగ్​ కోసం అత్యాధునిక సాంకేతికతను నాసా వినియోగించింది. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే.. అంగారకుడిపై చిత్రాలు తీయడానికి, ధ్వనిని రికార్డు చేయడానికి ఇందులోనే ఎక్కువ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చింది.
 
గ్రహంపై ఉన్న రాళ్లను సేకరించే ట్యూబులు కూడా అత్యంత శుభ్రమైనవని నాసా వెల్లడించింది. ఇతర స్పేస్​క్రాఫ్ట్​ల లాగే పర్​సర్వెన్స్​ కూడా 300మిలియన్​ మైళ్లుకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపై అడుగుపెట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆరు చక్రాల పెర్​సీవరెన్స్​.. నాసా ప్రతిష్టాత్మక 'క్యూరియాసిటీ' రోవర్​తో పోలి ఉంటుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments