Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్రపూజల కోసం నరబలి ఇచ్చారా..? అనంతలో కలకలం

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (21:53 IST)
అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. ఏపీలో మదనపల్లె తరహాలో అనంతపురంలో నరబలి ఇచ్చారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. బమ్మనహాల్‌ మండలం హెచ్‌ఎల్‌సి కాలువ వద్ద బుధవారం ఓ యువకుడిని క్షుద్రపూజలు చేసి హత్య చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఉంతకల్లు గ్రామ సమీపంలోని హెచ్‌ఎల్‌సి కాలువ గట్టుపై గుర్తు తెలియని 24 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. 
 
ఎస్‌ఐ బాషా తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు మృతి చెందిన ప్రాంతంలో నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో వేసిన ముగ్గు, ఆకులు తదితర వాటిని గుర్తించారు. క్షుద్రపూజల అనంతరం యువకుడిని నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన వ్యక్తి బళ్లారి ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. 
 
హత్య జరిగిన ప్రాంతంలో ఆనవాళ్లను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. క్షుద్రపూజల కోసమే యువకుడిని హత్య చేశారా..? లేక ఇతర కారణాలతో చంపి అనుమానం రాకుండా నిందితులు ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments