Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.. నారా లోకేష్ పిలుపు

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (13:37 IST)
ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవాలనే తపన కువైట్‌లో స్థిరపడ్డ తెలుగువారిలో కనిపిస్తోందని ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. కువైట్‌లో ఉన్న ఆంధ్రులతో శంఖారావం సభను నిర్వహించారు. కువైట్ శంఖారావం సందర్భంగా అక్కడ స్థిరపడిన తెలుగువారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. 
 
అక్కడ వుంటున్నప్పటికీ జన్మభూమిలో జరిగే అభివృద్ధిని తెలుసుకోవాలనే తపన వారిలో కనిపించిందని చెప్పారు. అందుకే ఏపీలో ఈ నాలుగన్నర ఏళ్ళలో జరిగిన అభివృద్ధి గురించి వారికి వివరించానని తెలిపారు. ప్రపంచంలోని 135 దేశాల్లో ఉన్న 25లక్షల మంది ప్రవాసాంధ్రులకు తాను చెప్పేది ఒక్కటే.. ఏ దేశంలో వున్న ప్రవాసాంధ్రులంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని ట్వీట్ చేశారు. 
 
మరో ట్వీట్ చేస్తూ.. మహానాయకుడు సినిమా గురించి ప్రస్తావించారు. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలకు ఈ సినిమా ఓ కమనీయ దృశ్య కావ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల్లోంచి పుట్టిన ఒక నాయకుడి ప్రయాణం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, వెరసి నందమూరి అభిమానులకు, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం కమనీయ దృశ్య కావ్యమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments