Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీగా నా డ్యూటీ నేను చేస్తున్నా... సీఎం చొక్కాప‌ట్టుకో అనలేదే...

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (13:00 IST)
గుంటూరు జిల్లాలో ఓ బాధిత కుంటుంబాన్ని ప‌రామ‌ర్శించాల‌ని బ‌య‌లుదేరిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేష్ ను బ‌య‌ట‌కు రాగానే అదుపులోకి తీసుకున్నారు. 
 
నారా లోకేష్ గుంటూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డానికి ప‌ర్మిష‌న్ లేద‌ని, అందుకే అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసు అధికారులు చెప్పారు. దీనితో లోకేష్ పోలీస్ అధికారుల‌తో వాద‌న‌కు దిగారు. త‌న‌ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల‌ని నిల‌దీశారు.
 
నేను రాజ్యాంగ ప‌రంగా న‌డుచుకుంటున్నా... నా హ‌క్కు ప్ర‌కారం న‌న్ను వెళ్ల‌నివ్వండి... ఒక బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు నేను వెళుతున్నా... ఒక ఎం.ఎల్.సిగా నా డ్యూటీ నేను చేస్తున్నా...  నాపైన ఎలాంటి కేసులు లేవు. ఎవ‌రిపైనా దాడి చేసిన‌, దుర్భాష‌లాడిన కేసులేమీ లేవు. ఒక్క ట్రాక్ట‌ర్ రాష్  డ్రైవింగ్ కేసు త‌ప్ప ఏం లేదు అని లోకేష్ వివ‌ర‌ణ ఇచ్చారు.
 
మేం అక్క‌డికి వెళ్లి ఏం గొడ‌వ చేయ‌ట్లేదే? ఒక బాధితురాల కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పేందుకు వెళుతున్నా... అంతేగాని, సీఎం చొక్కా ప‌ట్టుకోమ‌ని నేను ఎపుడూ చెప్ప‌లా... అయినా  ఆంధ్ర‌లో ఎక్క‌డా లేని లా అండ్ ఆర్డ‌ర్ రూల్స్ ని గుంటూరులో ఎందుకు అమ‌లు చేస్తున్నారు? అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు. నారా లోకేష్ పోలీసు అధికారుల‌తో చేసిన వాగ్వాదం మొత్తాన్ని ఆయ‌న అనుచ‌రులు వీడియో తీసి వైర‌ల్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments